15-12-2025 12:11:39 AM
అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు
గజ్వేల్, డిసెంబర్ 14: ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా చేయాలని నూతన సర్పంచులకు మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ఆదివారం మాజీ ఏఎంసి చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో అహ్మదీపూర్ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి ప్రభాకర్, ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, వార్డు మెంబర్లు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కొంపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వారిని మాజీమంత్రి హరీష్ రావు అభినందించారు. ఓట్లు వేసి ఆశీర్వదించిన ప్రజలకు అండగా నిలవాలని, గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మద్ది రాజిరెడ్డి, పాల రమేష్ గౌడ్, అహ్మద్, నిజామోద్దీన్, చాడ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, యువకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..