03-10-2025 08:26:17 PM
మందమర్రి,(విజయక్రాంతి): మందమర్రి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించి శరన్నవరాత్రి వేడుకల్లో పూజలందుకున్న అమ్మ వారు శుక్రవారం అంగరంగ వైభవంగా నిమజ్జనం నిర్వహించారు. అంతకు ముందు ఆయా మండపాల ఆధ్వర్యంలో నిర్వాహకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా నవరాత్రు లు పూజలందుకున్న అమ్మ వారి చీరలు, కలశాలకు వేలం పాటలు నిర్వహించగా భక్తులు పోటాపోటీగా వేలం పాటలో పాల్గొని అమ్మవారి పూజ సామాగ్రిని దక్కించు కున్నారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలలో అమ్మవారిని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జన శోభాయాత్ర పలువురిని ఆకట్టుకుంది.
శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ సమీపంలో శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక మండలి ఆధ్వర్యంలో దుర్గ మాతను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రులలో చివరి ఘట్టం అమ్మ వారి నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మహిళలు కోలాటాలు, చిన్నారుల నృత్యాల నడుమ కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.