calender_icon.png 3 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వాలు గోశాలలను ప్రోత్సహించడం కాదు

03-10-2025 08:49:36 PM

ఆవులను రైతులు పెంచుకునేలా ప్రోత్సహించాలి: కొమ్ము

ఉప్పల్,(విజయక్రాంతి): ప్రభుత్వంలు గోశాలను ప్రోత్సహించడం కాకుండా  ఆవులను రైతులే పెంచుకునే విధంగా ప్రోత్సహించాలని రైతు సంక్షేమ సేవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కొమ్ము ప్రేమ్ సాగర్ అన్నారు. గోశాలలో ఉన్న ఆవులు గోసపడుతున్నాయని ఇటీవల ప్రభుత్వాలు విశాలమైన ప్రదేశాలలో గోశాలలను నిర్మాణం చేసి ఆవులను ఉంచాలని, ప్రభుత్వాలు ప్రయత్నించడం హర్షనీయమే కానీ అంతకన్నా ముఖ్యమైన విషయాన్ని కూడా గ్రహించాలన్నారు. ప్రతి ఒక్క రైతు ఆవులను పోషిస్తూ సంరక్షిస్తే సమాజము ఎంతో బాగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

రైతు దగ్గర ఆవు ఉంటే రైతు బాగుపడతాడు ఆవు సుఖపడుతుంది. ఆవు మలమూత్రాల ద్వారా భూమి సారవంతం అవుతుంది ఆ భూముల పండిన పంటలు తిన్న ప్రతివారు ఆరోగ్యవంతులవుతారని ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు. మన పూర్వీకులంతా సేంద్రియ వ్యవసాయము పాడిపంటలు పండించుకొని తిని ఎంతో ఆరోగ్యంగా జీవించారు. వారి జీవన విధానాన్ని ప్రతి ఒక్కరు గ్రహించి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తే ఇటు పకృతి ప్రజలు బాగుంటారు. ఈ ప్రపంచంలో ఆవును మించిన రాణి జీవి లేదు అలాంటి పవిత్రమైన ఆవులు ప్రజల మధ్యలో లేకపోవడం ఎంతో బాధాకరం ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కనువిప్పు చేసుకొని మళ్లీ పల్లెల్లో పశుసంపద పెంచాలి.

ప్రభుత్వం కూడా పశువుల పెంపకానిపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించి పశువులను పెంచుకునే రైతులకు ప్రోత్సహిస్తూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేయాలి రైతులకు కూడా మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ మధ్యకాలంలో రైతులు ఒక ఆవుతో 30 ఎకరాలు పండించే సదుపాయం ఆవు మలమూత్రాలతో జీవామృతం తయారుచేసి పంటలకు వేయడంతో మంచి ఆరోగ్యకరమైన పంటలు పండిస్తున్నారు. ఇది ఎంతో సంతోష పడవలసిన విషయం ఆయన అన్నారు. కావున ఆహారముతోనే ఆరోగ్యమని అందరూ గ్రహించి ప్రభుత్వాలు పాలకులు ఎప్పుడైతే రైతును ప్రోత్సహిస్తారు. అప్పుడే ఆరోగ్యకరమైన దావా సమాజం నిర్మాణానికి నాంది పలుకుతుందని కొమ్ము ప్రేమ్ సాగర్ యాదవ్ తెలిపారు.