03-10-2025 08:57:45 PM
బాన్సువాడలో రావణ దహన కార్యక్రమం...
పాల్గొన్న ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం ఆగ్రో చైర్మన్ కాసుల...
బాన్సువాడ,(విజయక్రాంతి): చెడుపై మంచి విజయం సాధించినప్పుడే విజయదశమి పండుగ పర్వదినాన్ని ప్రజలందరూ జరుపుకుంటారని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజులు పేర్కొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా గురువారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన "రావణదహన" కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి , పోచారం సురేందర్ రెడ్డి లు ప్రజలతో కలిసి వీక్షించారు.
వరుసగా 15 సంవత్సరం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణదహన కార్యక్రమానికి బాన్సువాడ పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.అనంతరం స్వగ్రామం బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు పూజ చేసి జమ్మి ఆకును పంచుతూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.