calender_icon.png 3 October, 2025 | 10:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

03-10-2025 08:30:32 PM

 - పేద ప్రజల కోసం ఆస్తిని  దారాదత్తం చేసిన మహోన్నత వ్యక్తి

 - ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

- దామోదర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన పార్టీ శ్రేణులు

నల్గొండ రూరల్: మాజీ మంత్రి టైగర్ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. శుక్రవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ  ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు ఆర్పించి మాట్లాడారు. రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేద ప్రజల కోసం తన ఆస్తిని  పేద ప్రజల కోసం దారతత్వం చేసిన మహోన్నత వ్యక్తి అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉన్నాడని, ఆయన నిజంగానే టైగర్ల బతికాడని పేర్కొన్నారు.ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, నాయకులు కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, గంగుల సైదులు, గురుజ వెంకన్న గౌడ్, కంచర్ల ఆనంద్ రెడ్డి, నల్లగొండ అశోక్, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.