03-10-2025 08:41:50 PM
నిందితులపై కేసు నమోదు
మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలోని పాలచెట్టు ఏరియాలో ఇద్దరు యువకులపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లు పట్టణ సీఐ కే శశిధర్ రెడ్డి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన దాడి ఘటన వివరాలు వెల్లడించారు. పాలచెట్టు ఏరియాలో ఉన్న పచ్చిక రవితేజ, బండ రాకేష్ లపై, పట్టణంలోని విద్యానగర్ కు చెందిన కొందరు యువకులు ఆటో యు టర్న్ చేసుకునే అని సందర్భంలో మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. తాగిన మైకంలో ఉన్న యువకులు బాధితులపై చేతులు, కర్రలు, రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేయగా పచ్చిక రవితేజ తలకు గాయాలయ్యాయి.
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు కోట మహేష్, రెండ్ల శ్రీకాంత్, దానబోయిన నవీన్ కుమార్, పులి సతీష్, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఈ దాడిలో ప్రధాన సూత్రధారి జిల్లపల్లి ఆకాష్ ( బన్నీ), గుర్తు తెలియని వ్యక్తి పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దాడిలో గాయపడిన బండ రాకేష్ , అతని స్నేహితుడు బొంతల మురళి తో కలిసి కోట మహేష్ పై దాడి చేయగా మహేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాకేష్, మురళి లపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ చట్టాన్ని చేతు ల్లోకి తీసుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,నేర ప్రవృత్తిని కొనసాగించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించ డంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.