calender_icon.png 3 October, 2025 | 9:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఘనంగా విజయ దశమి వేడుకలు

03-10-2025 08:34:47 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లో  ఆయుధ పూజ,వాహన పూజ, షమీ వృక్షం పూజ లు వైభవంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఏఎస్పీ చిత్తరంజన్ లతో కలిసి పాల్గొన్నారు. అనంతరం దుర్గాదేవికి కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... విజయదశమి జిల్లా  ప్రజలకు  విజయం చేకూర్చాలని, సుఖ సంతోషాలను అందించాలని ఆకాక్షించారు. సిబ్బందితో కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఆకాంక్షించారు. శాంతి భద్రతల పరిరక్షణలో నిత్యం అప్రమత్తంగా ఉండే పోలీసులు తమ విధి నిర్వహణలో ఉపయోగించే ఆయుధాలను, వాహనాలను దైవ స్వరూపంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుందని అన్నారు.అనంతరం పోలీస్ అధికారులు,సిబ్బంది తో కలిసి దసరా శుభాకాంక్షలు తెలుపుతూ  అలాయ్ బలయ్ నిర్వహిస్తూ ఆనందించారు.