03-10-2025 08:21:36 PM
నకిరేకల్,(విజయక్రాంతి): మండలంలోని నోముల గ్రామ విజయ కనకదుర్గాదేవి దేవాలయంలో ప్రతిష్టించిన దుర్గాదేవి శోభాయాత్ర శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శోభయాత్ర సందర్భంగా ఆద్యంతం మహిళల కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, ఆటపాటలతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ కుంచం రమణమ్మ సోమయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వరకాంతం శేఖర్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ సామ సత్తిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సామ రవీందర్ రెడ్డి,ఆలయ ధర్మకర్త కొడదల బక్కయ్య, కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి,ఉపాధ్యక్షులుభీమనబోయిన వెంకటయ్య, కార్యదర్శి ఎలిజాల సైదులు, కార్యవర్గ సభ్యులు కొడదల లింగయ్య, మాచర్ల రాములు, బాధిని సోమయ్య, గర్శకోటి వెంకన్న, లగిశెట్టి శ్రీను, ఆలగడప సైదులు, శ్యామల పురుషోత్తం, దేశగోని వేణు కుమార్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కోమటిరెడ్డి జాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.