calender_icon.png 3 October, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాజులపల్లిలో గొర్రెల మందపై గుర్తు తెలియని జంతువు దాడి

03-10-2025 08:07:03 PM

9 గొర్ల మృతితో తీవ్రంగా నష్టపోయిన గొర్ల కాపరి కనుకయ్య

మంథని,(విజయక్రాంతి): మంథని మండలంలోని  గాజులు పల్లి గ్రామంలో గురువారం రాత్రి గంగుల కనకయ్యకు చెందిన గొర్ల మందపై గుర్తుతెలియని జంతువు గొర్ల మందపై దాడి చేశాయి. 9 గొర్రె పిల్లలను గొంతు కొరికి చంపేశాయి.  తెల్లారి కనకయ్య గొర్ల మంద వద్దకు వెళ్లి చూడగా 9 గొర్రె పిల్లలు మృతి చెందడంతో షాక్ అయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన గొర్ల కాపరి కనకయ్య కు తనకున్న 50 గోర్లతో తన కుటుంబన్ని పోసిస్తు జీవనం గడుపుతున్నాడు. గొర్రె పిల్లలు పెద్దయ్యాక అమ్ముకుంటే దాదాపు లక్ష రూపాయలకు పైన వచ్చేవని, ఇప్పుడు వాటినే గుర్తు తెలియని జంతువు చంపడంతో పండుగ పూట తీవ్రంగా నష్టపోయానని రోధిస్తున్నాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని ఆదుకొని  ఆర్థిక సహాయం అందించాలని అధికారులను కనకయ్య వేడుకున్నాడు. గొర్ల కాపరి కనుకయ్య ను ప్రభుత్వం అధుకొవాలని యాదవ సంఘం నాయకులు కోరారు.