29-09-2025 08:14:46 AM
దుబాయ్: ఆసియాకప్ 2025(Asia Cup Final) హై ఓల్టేజ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ పై భారత్(India vs Pakistan)ఘన విజయం సాధించింది. ఆసియా కప్ 2025 ప్రజెంటేషన్ సెర్మనీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ మంత్రి, ఏసీసీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు భారత్ ప్లేయర్స్ నిరాకరించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవ వేడుకకు భారత్ ఆటగాళ్లు నిరాకరించడంతో ట్రోఫీ ఇవ్వకుండానే నఖ్వీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దుబాయ్‌లో వేదికపై ట్రోఫీ లేకుండానే భారత్ ఆసియా కప్ విజయాన్ని జరుపుకుంది. అటు ఆసియా కప్ 2025 ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాకిస్థాన్ హైడ్రామా చేసింది.
రన్నరప్ చెక్‌ను తీసుకున్న తర్వాత పాక్ కెప్టెన్(Pakistan Captain Salman Ali Agha) దాన్ని విసిరేశాడు. స్పాన్సర్లు, అతిథులు స్టేజ్‌పై పాక్ కెప్టెన్ తీరు చూసి షాక్‌కు గురయ్యారు. ఫైనల్ లో పాకిస్థాన్ పై భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠ పోరులో భారత్ ను తిలక్ వర్మ గెలిపించారు. భారత్ బౌలింగ్ లో కుల్ దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, బుమ్రా తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఆసియా కప్ విజేత భారత్ కు రూ. 21 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. భారత్ ఆటగాళ్లు, సిబ్బందికి ప్రైజ్ మనీ చెల్లించారు. భారర్ తొమ్మిదో సారి ఆసియా కప్ ను గెలుచుకుంది. 17 ఆసియాకప్ లల్లో భారత్ అత్యధికంగా 9 సార్లు విజేతగా నిలిచింది.
ఆసియా కప్ ఫైనల్: పాకిస్థాన్ 146 ఆలౌట్, భారత్ 150/5.
భారత బ్యాంటింగ్: తిలక్ వర్మ 69 నాటౌట్, శివమ్ దూబే 33, సంజూ శాంసన్ 24, శుభ్ మన్ గిల్ 12,
పాక్ బ్యాటింగ్: ఫర్హాన్ 57, ఫఖర్ జమాన్ 46, సయీమ్ 14,