calender_icon.png 1 October, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దుర్గాదేవి సన్నిధిలో దుర్గంబిక మహా చండీ హోమం

01-10-2025 08:06:25 PM

చిట్యాల (విజయక్రాంతి): శ్రీ కనకదుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆలయ సన్నిధిలో బుధవారం దుర్గాంబిక చండీ హోమం ఘనంగా నిర్వహించారు. చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో శ్రీకనకదుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో ఆయన కుమారులు పల్లపు రాకేష్, పల్లపు సాయిలు దుర్గాంబిక చండీ హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో భవాని మాల దారులు, భక్తులు, యువజన సంఘం నాయకులు కురుపాటి శ్రీకాంత్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.