calender_icon.png 25 June, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారులు, సిబ్బంది నైపుణ్యాభివృద్ధి, ప్రదర్శనకు సరైన వెదికే డ్యూటీ మీట్

24-06-2025 07:43:41 PM

జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి..

ఆరు అంశాలలో పోలీసు సిబ్బందికి పరీక్షలు..

రిబ్బన్ కట్ చేసి డ్యూటీ మీట్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ..

రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతలు కావాలని ఆకాంక్ష...

ములుగు (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి నిర్వహిస్తున్న పోలీసు డ్యూటీ మీట్(Duty Meet)లో భాగంగా జిల్లా స్థాయి డ్యూటీ మీట్ ను ములుగు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నందు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి(District SP Dr. Shabarish), రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేందుకు, పెంపొందించేందుకు ఈ డ్యూటీ మీట్ దోహదపడుతుందని తెలిపారు. ఇలాంటి డ్యూటీ మీట్ లను సద్వినియోగం చేసుకొని రాష్ట్రస్థాయి, జాతీయస్థాయి డ్యూటీ మీట్ లలో ఉత్తమ ప్రతిభ కనబరిచి అవార్డులను కైవసం చేసుకునే విధంగా కష్టపడి తమ ప్రతిభను కనబరచాలని సూచించారు.

ఈ డ్యూటీ మీట్ ల నందు ముఖ్యంగా నేర పరిశోధన, నేర స్థల పరిశోధన, విఐపి మూమెంట్, యాంటి సబటెజ్ చెక్, డాగ్ స్క్వాడ్ యొక్క పనితనం, ఫింగర్ ప్రింట్స్ పై పరిశోధన, ఫింగర్ ప్రింట్స్ తీయు విధానం, బాంబు డిస్పోజల్ టీం యొక్క విధులు, కంప్యూటర్ పరిజ్ఞానం, నేర స్థలం నందు ఫోటోగ్రఫీ అవాంఛనీయ సంఘటనలు సంభవించినప్పుడు వీడియోగ్రఫీ చేయు విధానం, వీడియోగ్రఫీ ద్వారా నేరస్తులను కనుగొనే విధానం, లాంటి అంశాలలో రాత పరీక్ష మరియు మౌఖిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జోనస్ పైకి ఎంపిక చేసి, వారు రాష్ట్రస్థాయి, జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ పరీక్షలలో కొన్ని అంశాలు ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వారికి, మరి కొన్ని అంశాలు ఏఎస్ఐ, కానిస్టేబుల్ స్థాయి వారికి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి డ్యూటీ మీట్ లలో పాల్గొన్నప్పుడు తమకు ఉన్న నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని, ప్రస్తుత సమాజంలో నేరగాళ్లు ఉపయోగిస్తున్న నూతన పద్ధతులను తెలుసుకోవచ్చని, నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని, ట్రైనింగ్ నందు, వాస్తవానికి ఉన్న భేదాలను గమనించవచ్చని తెలిపారు.

నేరం జరుగు పద్ధతులను పరిశోధించే విధానాలను వివరంగా అర్థం చేసుకొని తమ విధులకు ఉపయోగకరంగా మార్చుకోవాలని తెలిపారు. ఎలాంటి సందేహాలు ఉన్న ఉన్నతాధికారులు, అనుభవం ఉన్న అధికారుల ద్వారా నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిఆర్బి డిఎస్పీ, ములుగు డిఎస్పి రవీందర్, ఇన్స్పెక్టర్లు సురేష్ కుమార్, రవీందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు స్వామి, సంతోష్ కుమార్, తిరుపతి, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, ఫింగర్ ప్రింట్, డిసిఆర్బి, బిడి టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.