18 April, 2026 | 11:03 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

అనాజీపురం రైతు వేదికలో సంబరాలు

24-06-2025 07:37 PM

జై కాంగ్రెస్.. జై సోనియమ్మా.. జై రేవంత్ మిన్నంటిన నినాదాలు...

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం అనాజీపురం, చీదేళ్ల, పెన్ పహాడ్ రైతు వేదికలో రైతు భరోసా సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తన మంత్రివర్గంతో కలసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో రైతులతో ముఖాముఖీ మాట్లాడారు. రైతుల అభివృద్దే ద్యేయంగా ప్రజాపాలన అందిస్తుందని అందులో భాగంగానే వానాకాలంలో రైతుల పెట్టుబడి కోసం కేవలం 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతుల ఖాతాలోకి వేసి ఆదుకున్నట్లు సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించాడంతో రైతులు హర్షధ్వనాలు.. జై సోనియామ్మ.. జై కాంగ్రెస్.. జై రేవంత్ నినాదాలతో రైతు వేదికలు మిన్నంటాయి. కార్యక్రమంలో ఏఓ అనిల్ కుమార్, ఏఈఓ కోడి మురళి, రైతులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.