7 August, 2026 | 1:13 AM

సుంకాలు రీఫండ్

07-08-2026 12:13 AM
  1. అమెరికా సుప్రీం ఆదేశంతో 9.5 లక్షల కోట్లు వెనక్కి
  2. ట్రంప్ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

వాషింగ్టన్, ఆగస్టు 6: ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాలను అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీంతో అమెరికా ప్రభుత్వం సుంకాలను రీఫండ్ చేస్తుంది. సుప్రీంకోర్టుకు ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం సమర్పించిన ఫైలింగ్‌లో పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటికే వంద బిలియన్ డాలర్లు (రూ.9.5 లక్షల కోట్లకుపైగా) దిగుమతిదారులకు వెనక్కి ఇచ్చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చాక ట్రంప్ భారీ సుంకాలతో విరుచు కుపడి, 166 బిలియన్ డాలర్లను ప్రపంచ దేశాల నుంచి వసూలు చేశారు.

పరిమితులు దాటి సుంకాలను విధించారని గతేడాదే సుప్రీంకోర్టు ట్రంప్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వసూలు చేసిన సొమ్ము తిరిగి ఇవ్వాల్సిందేనని కోర్టు ఆదేశించింది. దిగుమతి పేరిట విధించిన భారీ సుంకాలతో అమెరికా ఖజానాలో రోజుకు రూ.4,538 కోట్లు వచ్చాయి. చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్ లాంటి దేశాల నుంచి ఈ సుంకాలను వసూలు చేశారు. కోర్టు నిర్ణయంతో సుంకా లను రీఫండ్ చేస్తుండడంతో అన్నిదేశాలు హర్షం వ్యక్తం చేశాయి.