calender_icon.png 17 January, 2026 | 2:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇ ఎలెక్టర్ ఫోటో గుర్తింపు కార్డు ఇవ్వాలి

17-01-2026 12:28:20 PM

కుభీర్ జనవరి 17:(విజయక్రాంతి):ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరుకు ఈ ఎలెక్టర్ ఫోటో గుర్తింపు కార్డు ఇవ్వాలని సామాజిక కార్యకర్త జాధవ్ పుండలిక్ రావు పాటిల్ డిమాండ్ చేశారు. చాలామంది ఓటర్లు నిరక్షరాస్యులు కావడంతో వారికి ఓటు ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ఓటు హక్కు ఉన్న ఓటరు నంబరు తెలియని పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. అక్షరాశ్యులకు సైతం చాలామందికి కార్డు లేదని ఆయన తెలిపారు. పురపాలక సంఘం ఎన్నికలు సమీపించినందున ప్రతి ఓటరుకు ఓటర్ గుర్తింపు కార్డు వెంటనే జారీ అయ్యేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.