calender_icon.png 17 January, 2026 | 3:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం

17-01-2026 02:10:18 PM

ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్.

మరిపెడ,విజయక్రాంతి: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో కాంగ్రెస్ పార్టీతోనే(Congress government) సామాజిక న్యాయం జరుగుతుందని ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రనాయక్ అన్నారు. శనివారం మరిపెడ మున్సిపల్ కేంద్రం ఆడిటోరియంలో129 కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే రామచంద్రనాయక్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరగలేదన్నారు.

గత ప్రభుత్వంలో కళ్యాణ లక్ష్మి చెక్కు అప్లై చేసిన దగ్గర నుంచి ఆ చెక్కు ఎప్పుడు ఇస్తారో అనేది కూడా తెలియకుండా ఉండేదని కానీ ప్రజా ప్రభుత్వంలో పెళ్లయిన నవ వధువులకు ఆరు నెలలకు ముందే కళ్యాణ లక్ష్మి చెక్కు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని రాబోయే రోజుల్లో డోర్నకల్ నియోజకవర్గానికి మరిన్ని నిధులు తెచ్చి రాష్ట్రంలోనే డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చి దిద్దుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఎమ్మార్వో కృష్ణవేణి ,ఆర్ ఐ శరత్ చంద్ర,మరిపెడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి, జిల్లా నాయకులు ఒంటికొమ్ము యుగేందర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, మాజీ సర్పంచ్ రామ్ లాల్ ,కేసముద్రం మార్కెట్ వైస్ చైర్మన్ ఐలమల్లు, అంబరీష ,తదితరులు పాల్గొన్నారు.