calender_icon.png 17 January, 2026 | 3:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగారెడ్డి జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

17-01-2026 02:05:13 PM

ఆశావాహుల్లో కలకలం!

బీసీ కమిషన్ నివేదిక ప్రకారం వార్డుల కేటాయింపు.. 

ఆమనగల్‌లో మారిన రాజకీయ సమీకరణాలు.

​ఆమనగల్లు, (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదికను అనుసరించి, జిల్లా ఎన్నికల అధికారి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం కోటాను అమలు చేస్తూ నిర్వహించిన డ్రా ప్రక్రియ రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది.

ఆశలు ఆవిరి.. ఆందోళనలో అభ్యర్థులు

​మున్సిపల్ చైర్మన్ పీఠంతో పాటు, వార్డుల వారీగా వెలువడిన రిజర్వేషన్లు పలువురు ఆశావాహులకు షాక్ ఇచ్చాయి. బీసీ రిజర్వేషన్ వస్తుందని ఆశించిన చోట జనరల్ కేటాయించడం, జనరల్ వస్తుందని భావించిన వార్డులు మహిళలకు రిజర్వ్ కావడంతో గెలుపు గుర్రాలుగా భావించిన నేతలు నిరాశకు గురయ్యారు. ఈ మార్పులతో ఆయా మున్సిపాలిటీల్లో ఒక్కసారిగా రాజకీయ సందడి పెరగడమే కాకుండా, కొత్త అభ్యర్థుల వేట కూడా మొదలైంది.

ఆమనగల్ మున్సిపాలిటీ: 15 వార్డుల వివరాలు.....

​ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డుల రిజర్వేషన్ ఖరారు కావడంతో క్షేత్రస్థాయిలో అభ్యర్థులు తమ బలాబలాలను అంచనా వేసుకుంటున్నారు.  జిల్లా వ్యాప్తంగా ఉన్న మిగిలిన ఆరు మున్సిపాలిటీల్లో కూడా ఇదే తరహా ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పదవుల కేటాయింపుపై స్పష్టత రావడంతో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.

రిజర్వేషన్లు ఖరారైన వార్డులు ఇవే:

ఆమనగల్లు చైర్మన్  జనరల్...

వార్డు నం. వార్డు పేరు

1 చంద్రాయన్ పల్లి తండా (జనరల్ మహిళ)

2 ముర్తుజపల్లి( ఎస్సీ మహిళ )

3 నుచ్చుగుంట( జనరల్ మహిళ)

4 జంగారెడ్డిపల్లి( జనరల్)

5 ఎస్సీ కాలనీ జనరల్

6) సాయి నగర్ (గుర్రం గుట్ట) ఎస్టి 

7) వెంకటేశ్వర కాలనీ (ఎస్టి)

8 )బీసీ కాలనీ (ఎస్సీ జనరల్)

9 )విద్యానగర్ ( జనరల్)

10) విఠాయిపల్లి( జనరల్ మహిళ )

11 )ఆదర్శనగర్ (ఎస్టి మహిళ)

12 )శాంతినగర్ (బిసి జనరల్)

13 )శ్రీనివాస కాలనీ  (ఎస్టి మహిళ)

14 )అంబేద్కర్ నగర్,ప్రేమ్ నగర్ (జనరల్)

15 )శివాలయం (జనరల్ మహిళ)