17-01-2026 01:10:40 PM
హైదరాబాద్: తెలంగాణలో కార్పొరేషన్లు మేయర్లు, మున్సిపల్ ఛైర్ పర్సన్ ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. రిజర్వేషన్ల వివరాలను మున్సిపల్ శాఖ డైరెక్టర్ శ్రీదేవి(Municipal Department Director Sridevi) వెల్లడించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు శ్రీదేవి సూచించారు. కార్పొరేషన్లలో రిజర్వేషన్లు: ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు.
కొత్తగూడెం కార్పొరేషన్ రిజర్వేషన్(Kothagudem Corporation Reservation) ఎస్టీ జనరల్ కు, రామగుండం కార్పొరేషన్ రిజర్వేషన్ ఎస్సీ జనరల్ కు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ బీసీ మహిళకు, మంచిర్యాల కార్పొరేషన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కు, కరీంనగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ బీసీ జనరల్ కు కేటాయించారు. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు.