17-01-2026 02:07:54 PM
ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు
బెజ్జూర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీనగర్ వార్డు నంబర్ 10, 11లలో సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు పర్యటించారు.ఈ సందర్భంగా తాను మంజూరు చేయించిన 25 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలాజీనగర్ లో డ్రైనేజీ,త్రాగునీటి సమస్య అధికంగా ఉందని,కాగజ్ నగర్ పట్టణంలో పూర్తిస్తాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
అలాగే త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు కొత్తగా నిర్మించనున్నామని, తద్వారా త్రాగునీటి సమస్యకు పరిష్కారం కనుగొంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, భాజపా పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివ కుమార్, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొండ తిరుపతి, మాజీ కౌన్సిలర్ సింధం శ్రీనివాస్, దెబ్బటి శ్రీనివాస్, దేశ్ ముఖ్ శ్రీనివాస్, పోలడీ హనుమంత్ రావు, చిలువేరు ప్రవీణ్, గజ్జల లక్ష్మణ్, శివ గౌడ్, జ్యోతిష్ బాబు, కాయితోజు శ్రీనివాస్, నీకోడే అర్జున్, సౌరబ్ ధాత్రక్, దేశ్ ముఖ్ సాయి, కొప్పుల సుధాకర్, కాలనీ వాసులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.