calender_icon.png 17 January, 2026 | 4:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళ ఖరారు

17-01-2026 02:03:13 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో గత రెండు రోజుల క్రితం అన్ని మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు ఖరారు చేయడం జరిగింది. శనివారం ప్రతి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఇందులో భాగంగా బాన్సువాడ మున్సిపల్ చైర్మన్(Banswada Municipal Chairman) గా బీసీ మహిళను ఖరారు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు.

బాన్సువాడ మున్సిపల్ పరిధిలో వార్డుల వారిగా రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 1 వ వార్డు జనరల్ మహిళ, 2 వ వార్డు బీసీ జనరల్, 3 వ వార్డు జనరల్, 4 వ వార్డు ఎస్సీ జనరల్,5 వ వార్డు జనరల్ మహిళ,6 వ వార్డు జనరల్ మహిళ,7 వ వార్డు బీసీ మహిళ,8 వ వార్డు ఎస్సీ మహిళ,9 వ వార్డు జనరల్ మహిళ,10 వ వార్డు ఎస్టీ,11 వ వార్డు జనరల్,12 వ వార్డు జనరల్,13 వ వార్డు జనరల్,14 వ వార్డు బీసీ మహిళ,15 వ వార్డు బీసీ జనరల్,16 వ వార్డు జనరల్,17 వ వార్డు బీసీ మహిళ,18 వ వార్డు బీసీ మహిళ,19 వ వార్డు బీసీ జనరల్. గా ప్రకటించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు తెలిపారు.