17-01-2026 12:29:57 PM
పాదయాత్ర ప్రారంభించిన సర్పంచ్ పద్మ శంకర్
బెజ్జూర్,(విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని ఎలుక పెళ్లి 'బి ' అభయాంజనేయ స్వామి ఆలయం నుండి చెప్రాలకు 21 వ మహాపాదయాత్రను సిద్ధపూర్ సర్పంచ్ చెండే పద్మ శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. మహా పాదయాత్ర భక్తులు బెజ్జూర్ శ్రీ రంగనాయక స్వామి, శివాలయం, హనుమాన్, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, నాగదేవత ఆలయాలలో అర్చకులు శ్రీనివాస్ చారి ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర భక్తులు చెప్రాలకు బయలుదేరారు.
పాదయాత్ర భక్తులకు అల్పాహారం,పండ్లు, వాటర్ బాటిల్ పంపిణీ
మహా పాదయాత్ర భక్తులకు గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు బెజ్జూర్ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి కోనేరు అభిమానులు పండ్లు పంపిణీ చేశారు. రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణంలో సామల వెంకటేశం తేనేటి విందు, గ్రామపంచాయతీ 1 వ వార్డు మెంబర్ సామల తిరుపతి బిస్కెట్స్, సబ్ స్టేషన్ సమీపంలో మాజీ ఎంపిటిసి పర్వీనా సుల్తానా,జావిద్ అరటి పండ్లు వాటర్ బాటిల్స్ పంపించేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో నాగుల్వాయి యూత్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. కుకుడ గ్రామంలో సర్పంచ్ చిరంజీవి అరటి పండ్లు వాటర్ బాటిల్ తేనేటి విందు ఏర్పాటు చేశారు.పోతపల్లి చౌరస్తాలో కాటేపల్లి సర్పంచ్ అల్పాహారం పంపిణీ చేశారు.బారేగూడ గ్రామంలో నాయకులు రేణిగుంట్ల పెంటయ్య అల్పాహారం పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పాదయాత్ర నిర్వహికులు కొండవీటి భాస్కర్ రాజ్, ఆలయ కమిటీ అధ్యక్షులు తంగేడుపల్లి మహేష్, కుట్రంగి రామకృష్ణ, ఆలయ కమిటీ మాజీ అధ్యక్షుడు రాచకొండ శ్రీ వర్ధన్,మాజీ ఉపసర్పంచ్ సుధాకర్ గౌడ్, నికాడి బాబురావు, నాయకులు అమీరుద్దీన్, సూర్ల ఇస్తారి, తంగేడి పల్లి నీలేష్, రమేష్, తాజుద్దీన్, తిరుపతి, విజయ్, రవి, జాకీర్, సిరాజ్ పాదయాత్ర భక్తులు పాల్గొన్నారు.