calender_icon.png 17 January, 2026 | 3:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికింద్రాబాద్ అస్తిత్వానికి భంగం కలగదు

17-01-2026 01:45:26 PM

సికింద్రాబాద్ ప్రజలకు వ్యతిరేకం కాదు.

కేటీఆర్ 10 ఏళ్లు ఏం చేశారో చెప్పాలి.

హైదరాబాద్: సికింద్రాబాద్ అస్తిత్వానికి ఏ రకంగా భంగం కలగదని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. గతబీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాల చేసిందన్నారు. అప్పుడే ఎందుకు సికింద్రాబాద్ జిల్లా చేయలేదని ప్రశ్నించారు. ప్రజల నుంచి డిమాండ్ ఉంటే ప్రభుత్వం తప్పకుండా పరిశీలిస్తోందని హామీ ఇచ్చారు. గతంలో అశాస్త్రీయంగా జిల్లాలు ఏర్పాటు చేశారని మంత్రి పొన్నం ఆరోపించారు. జిల్లాల రేషనలైజేషన్ కోసం కమిటీ వేస్తున్నామని తెలిపారు. రిటైర్డ్ జడ్జ్ కమిటీ అందరి అభిప్రాయాలు తీసుకుంటుందని సూచించారు. హుస్నాబాద్ ను కూడా కరీంనగర్ జిల్లాలో కలుపుతామని మంత్రి వెల్లడించారు. కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao), బీఆర్ఎస్ నేతలు మాట్లాడే ముందు 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మల్కాజ్ గిరి జిల్లా పేరు బీఆర్ఎస్ హయాంలోనే వచ్చిందన్నారు. ఆరోజే సికింద్రాబాద్ జిల్లా చేయాలని బీఆర్ఎస్ నేతలు ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ప్రజల అభిప్రాయానికి తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. తాము సికింద్రాబాద్ పేరు మార్చలేదు ఎలాంటి మార్పు చేయలేదని చెప్పారు.

సికింద్రాబాద్ చుట్టూ పొలిటికల్ రగడ

సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను(Secunderabad Municipal Corporation) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) శనివారం ఆందోళన చేపట్టింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వరకు ర్యాలీని(Secunderabad BRS rally) నిర్వహించాలని ప్రణాళిక వేశారు. అయితే, నగరంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగవచ్చనే కారణంతో పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి బ్యానర్‌పై అనుమతి కోరారని, కానీ శాంతిభద్రతలు, ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా దానిని తిరస్కరించామని అధికారులు తెలిపారు. ర్యాలీలో పాల్గొనడానికి ప్రయత్నించిన పలువురు పార్టీ కార్యకర్తలను ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు. దీనివల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత శాంతిభద్రతలను కాపాడటానికి ప్రత్యేక బలగాలతో సహా భారీగా పోలీసులను మోహరించారు.