calender_icon.png 8 July, 2025 | 12:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానబెట్టిన పల్లీలు తినండి

01-06-2025 12:00:00 AM

పల్లీలు చూడటానికి చిన్నవిగా కనిపించినా.. అవి శక్తివంతమైన పోషకాలతో నిండి ఉంటాయి. పల్లీలు వేయించుకొని తినేకంటే నానబెట్టుకుని తింటే చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.

నానబెట్టిన పల్లీల్లో.. కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని రాత్రి నానబెట్టి.. ఉదయం ఒక పదినిమిషాలు ఉడకపెట్టుకుని తింటే తేలికగా జీర్ణమై శరీరానికి రోజంతా కావాల్సినంత శక్తిని అందిస్తాయి. 

నానబెట్టిన పల్లీల్లో.. పొటాషియం, ఐరన్, జింక్, సెలీనియం, కాపర్, క్యాల్షియం వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. రక్తంలో హీమోగ్లోబిన్ స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. 

పల్లీల్లో ఉండే విటమిన్ సి, విటమిన్ ఈ వంటి పోషకాలు మెదడు కణాలకు ఆహారంగా పని చేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. 

నానబెట్టిన పల్లీలను బెల్లంతో కలిపి తినడం వల్ల వెన్ను సంబంధిత నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. 

డయాబెటిస్ ఉన్నవారికి నానబెట్టిన పల్లీలు ఒక వరంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. గ్లుసైమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంచడంతో పాటు డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.