calender_icon.png 7 July, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖర్జూర పండ్లు తింటున్నారా?

01-06-2025 12:00:00 AM

ఖర్జూర పండ్లు అనేక ఆరో గ్య సమస్యలను దూ రం చేస్తాయి. అతిగా ఖర్జూరపండ్లను తింటే మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు నిపుణులు.

ఖర్జూర పండ్లలో ఫైబర్, పొటాషియం, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే డయాబెటీస్ ఉన్నవారు ఖర్జూరను అతిగా తింటే హైపో గ్లుసైమియా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఊబకాయం ఉన్నవారు ఖర్జూర పండ్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ పండ్లను అతిగా తింటే జీర్ణ వ్యవస్థను పాడు చేస్తాయి. 

మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. చర్మం ఎర్రబడటం, దురద రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

అలాగే దంతాల సమస్య వచ్చే అవకాశం ఉంది. ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే శరీరానికి శక్తి వస్తుంది. వ్యాయామం తర్వాత తింటే శక్తి స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

భోజనానికి ముందు ఖర్జూరపండ్లను తింటే ఆకలిని తగ్గిస్తుంది.