ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం పోస్టర్ ఆవిష్కరణ
హనుమకొండ, ఆగస్టు 18 (విజయ క్రాంతి): ఈనెల 22న హన్మకొండ కేంద్రంగా జరగనున్న ’ఓరుగల్లు జనసైనికుల ఆత్మీయ సమావేశం’ పోస్టర్ ను గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో జనసేనపార్టీ నాయకులు ఆవిష్కరించారు.ఈ సందర్బంగా పార్టీ జిల్లా ముఖ్య నాయకులు గాదె పృథ్వీ,డా.పద్మజాదేవి లు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్నీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసైనికులతో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు పార్లమెంట్ సెగ్మెంట్ల జనసైనికులతో హన్మకొండ కేంద్రంగా ఈ నెల 22 శనివారం రోజు ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు అమంచ సునీల్,శివకోటి,రవితేజ,మెడిద ప్రశాంత్ రెడ్డి,అనుదీప్,బర్ల శివ,బయ్య పద్మావతి,నాగమణి,ఫరీద్,డేవిడ్,రంజిత్,బండి నాగరాజు,షైక్ ఆన్సర్,మధు సుధన్,నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.






