17-08-2025 04:58:47 PM
పాట్నా: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజల పోలింగ్ స్టేషన్ చిరునామా మారుతుందని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పేర్కొంది. బూత్‌ల పునర్వ్యవస్థీకరణ చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపు, డ్యూయల్ ఓటర్ ఐడి (EPIC) ఉన్న ఓటర్లు, శాశ్వతంగా వలస వచ్చిన ఓటర్లు, ఓటరు జాబితాలో కొత్త ఓటర్ల పేర్లను చేర్చడం వల్ల ఇది సాధ్యమైందని సీఈసీ వెల్లడించారు. అలాగే, ప్రతి పోలింగ్ స్టేషన్‌కు ఓటర్ల సంఖ్య 1500 నుండి 1200కి తగ్గడం వల్ల ఈ మార్పు సాధ్యమవుతుందన్నారు.
కమిషన్ దీనికి సన్నాహాలు ప్రారంభించిందని, ఈ మార్పును 90712 బూత్‌లకే పరిమితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అవసరాన్ని బట్టి దీనిని పెంచవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ముసాయిదా జాబితా నుండి పేర్లు తొలగించబడిన 65,64,075 మంది ఓటర్లలో 22,34,000 మంది మరణించినట్లుగా ఎన్నికల కమిషన్ గుర్తించిందన్నారు. 36,28,000 మంది శాశ్వతంగా తమ స్థానాన్ని విడిచిపెట్టగా, ఏడు లక్షల మంది ఓటర్ల పేర్లు ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాల ఓటరు జాబితాలో నమోదు చేయబడ్డాయని తెలిపారు.
కమిషన్ ఇప్పుడు ఒక బూత్ 1200 మంది ఓటర్లకు మాత్రమే ఉంటుందని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 77895 బూత్‌లు ఉన్నాయని, వీటిని గతంలో 1500 ఓటర్ల ప్రమాణంలో నిర్మించారు. కానీ ఇప్పుడు బూత్‌ల సంఖ్యను 90,712కి పెంచినట్లు సీఈసీ వ్యాఖ్యానించారు. దీని వలన ప్రజలకు ఓటు వేయడం సులభతరం అవుతుందని, దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతున్న దృష్ట్యా, భారత ఎన్నికల సంఘం ఇప్పుడు అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు, నివాస కాలనీలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అపార్ట్‌మెంట్ సంస్కృతి వేగంగా అభివృద్ధి చెందుతున్న బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ నిర్ణయం చాలా ముఖ్యమైనది.
పట్టణీకరణను ప్రోత్సహించే చొరవ కారణంగా మున్సిపల్ ప్రాంతాల సంఖ్య ప్రస్తుతం 261కి చేరుకుంది. పాట్నా అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్న లక్షలాది మంది ఓటర్లు బూత్‌కు దూరం, పొడవైన క్యూల కారణంగా తరచుగా ఓటు వేయడానికి వెనుకాడుతారు. 2024 కేఏపీ సర్వే ప్రకారం 6.3 శాతం ఓటర్లు ఓటు వేయకపోవడానికి దూరం కారణమని, 2.4 శాతం ఓటర్లు పొడవైన క్యూలను పేర్కొన్నారు. ఇప్పుడు కమిషన్ కొత్త వ్యూహంతో ఈ దూరాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది.