17-08-2025 06:15:49 PM
ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం తలపెట్టిన చలో రాజ్ భవన్ ముట్టడిని విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లాకు అధ్యక్షుడు సయ్యద్ హైదర్ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్, బిజెపిలు అనుసరిస్తున్న వైఖర్లపై మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా వ్యవహరించడం సరికాదన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించడం దుర్మార్గమన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ ఆమోదం కోసం తలపెట్టిన చలో రాజ్ భవన్ కార్యక్రమానికి బీసీ నాయకులు సంఘాలు మేధావులు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ , జిల్లా కోశాధికారి అబ్దుల్ సాదిక్, తదితరులు పాల్గొన్నారు.