calender_icon.png 17 August, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాయిదా పడ్డ దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు

17-08-2025 06:27:12 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 19న జరగాల్సిన కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ (ఆదాని)సిమెంట్ కంపెనీ గుర్తింపు ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. 19న నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కంపెనీకి చెందిన తొమ్మిది మంది కార్మికుల ఓట్లను  తొలగించడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.

దీంతో 9 మంది కార్మికుల ఓట్లను తొలగించడం వెనక కారణాలు పరిశీలించేందుకు ఈ ఎన్నికలను కార్మిక శాఖ అధికారులు వాయిదా వేశారు. ఈనెల 26న కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ నిర్వహించే తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో ఎన్నికల తేదీ మరోసారి వెల్లడి కానుంది.