17-08-2025 06:23:26 PM
మల్కాజ్‌గిరి ఏసిపి చక్రపాణి
మేడిపల్లి: గణపతి నవరాత్రుల ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనరేట్, మల్కాజ్‌గిరి డివిజన్ ఏసిపి చక్రపాణి అన్నారు. ఆదివారం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఫంక్షన్ హాల్ లో వినాయక మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
మండపాలు ఏర్పాటు చేసేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమ నిబంధనలపై అవగాహన కల్పించారు. మండపాల వద్ద ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేస్తారని నిర్వాహకులు తమకు సహకరించాలని కోరారు. డీజే సౌండులకు పర్మిషన్ లేదని ఈ సందర్భంగా ఏసీపీ చక్రపాణి తెలిపారు.