calender_icon.png 17 August, 2025 | 7:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళికా మహాదేవి ముఖద్వారము శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాలు నాయక్

17-08-2025 05:52:12 PM

దేవరకొండ: చింతపల్లి మండలంలోని అంగడి కుర్మపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ జగజ్జనని కాళికా మహాదేవి ముఖద్వారము శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని, జగజ్జనని కాళికా మహాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ ఎమ్మెల్యే  నేనావత్ బాలు నాయక్. అనంతరం వారు మాట్లాడుతూ జగజ్జనని కాళికా మహాదేవి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ దేవరకొండ ప్రాంత ప్రజలపై ఉండి, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.