calender_icon.png 17 August, 2025 | 8:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దోమకొండ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

17-08-2025 06:51:22 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం దోమకొండ పద్మశాలి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఐరేణి నర్సయ్య, దోమకొండ మండల పద్మశాలి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

దోమకొండ పద్మశాలి సంఘం అధ్యక్షులుగా మ్యాక నాగరాజు, ఉపాధ్యక్షులుగా ఐరేణి, రాజేందర్, బొమ్మెర ప్రవీణ్, కుందేన వినోద్, ప్రధాన కార్యదర్శిగా బొమ్మెర గంగాధర్, సహాయ కార్యదర్శులుగా కూచని జగదీశ్, శ్రీగాధ మహాదేవ్, చాట్ల అనిల్ కోశాధికారిగా అందే గణేష్/నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడు మాట్లాడుతూ దోమకొండ పద్మశాలి సంఘం అభివృద్ధికి తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.