calender_icon.png 17 August, 2025 | 7:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగలు

17-08-2025 06:06:51 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): భీమిని మండలం వెంకటాపూర్ గ్రామంలో ఇళ్లపైనే విద్యుత్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. గత 20 ఏళ్లుగా విద్యుత్ సరఫరా ఫోళ్లకు బదులుగా కర్రలను మాత్రమే వాడుతున్నారు. వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంకటాపూర్ ఎస్టి వాడకు చెందిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకుంటున్నా వారు స్పందించడం లేదు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి  కర్రల స్థానంలో విద్యుత్ ఫోళ్ల ను ఏర్పాటు చేసి ప్రమాదాల బారి నుండి కాపాడాలని వెంకటాపూర్ ఎస్టీ వాడ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.