calender_icon.png 17 August, 2025 | 8:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షునిగా మూడోసారి ప్రశాంత్

17-08-2025 06:44:57 PM

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ యువజన సంఘం  నూతన కమిటీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో కొండగడుపుల ప్రశాంత్ మూడవ సారి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం సంఘంలో నలభై తొమ్మిది ఓట్లు ఉండగా అధ్యక్ష పదవికి కొండగడుపుల ప్రశాంత్, కొండగడుపుల నవీన్ లు పోటీపడ్డారు.చివరికి ప్రశాంత్ ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

ఉపాధ్యక్షునిగా తడక మల్ల మహేష్, మల్లెపాక సైదులు, ప్రధాన కార్యదర్శిగా బంగారి మనోజ్,కోశాధికారిగా మల్లెపాక అజిత్, సహాయ కార్యదర్శిగా మరికంటి హరేంద్ర, గేమ్స్ సెక్రటరీగా బొంకురి సాయి తేజ, సాంస్కృతిక కార్యదర్శిగా కత్తుల నరేందర్, పాల్వాయి సందీప్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు యువజన సంఘం సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలతో ముందడుగులో అంబేద్కర్ యువజన సంఘం కొనసాగుతుండడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.