calender_icon.png 17 August, 2025 | 8:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

17-08-2025 06:30:59 PM

నిర్మల్ జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో భవనంలో శ్రీ కృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని యాదవ ఉపాధ్యాయ ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం  శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కృష్ణ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు.చిన్నారులు శ్రీకృష్ణ గోపికల వేషాలను వేసి నృత్యాలను చేశారు. మహిళలు కోలాటాలు వేశారు.ఉట్టిని కొట్టే కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏవ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు భక్కీ భాస్కర్ , గౌరవ అధ్యక్షుడు భూమన్న యాదవ్ మాట్లాడుతూ ..శ్రీకృష్ణ లీలలు అమోఘమని, వారి మార్గము అనుచర నియమని, అందరూ వారి సహనాన్ని అలవర్చుకొని ముందుకెళ్లాలని తెలియజేశారు. శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా ప్రపంచానికి గురవయ్యాడని పేర్కొన్నారు. అనంతరం  ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాదవ విద్యార్థిని విద్యార్థులను, ఉద్యోగులను, పదవి విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులను సన్మానించారు.