calender_icon.png 12 July, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎడ్‌సెట్, పీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

12-07-2025 12:00:00 AM

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): టీజీ ఎడ్‌సెట్, టీజీ పీఈ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి శుక్ర వారం విడుదల చేసింది. నోటిఫికేషన్‌లను ఈనెల 14న విడుదల చేయ నున్నట్టు అధికారులు పేర్కొన్నారు. 21 నుంచి ఎడ్‌సెట్, 23 నుంచి పీఈసెట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా, వెబ్ ఆప్షన్లు ఎడ్‌సెట్‌కు ఆగస్టు 4 నుంచి, పీఈసెట్‌కు ఈనెల 31 నుంచి ఇచ్చుకునేందుకు అవకాశం కల్పించారు.

ఎడ్‌సెట్ తొలి విడుత సీట్లను ఆగస్టు 9న, పీఈసెట్ సీట్లను ఆగస్టు 4న కేటాయించనున్నారు. బీఎడ్ విద్యార్థులకు తరగతులు వచ్చే నెల 18 నుంచి, పీఈసెట్ అభ్యర్థులకు 11 నుంచి ప్రారంభం కానున్నట్టు పేర్కొన్నారు.