12-07-2025 12:00:00 AM
హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): ఎప్‌సెట్ కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు భారీగా ఆప్షన్లు ఇచ్చుకున్నారు. 94,059 మంది అభ్యర్థులు మొత్తం 56,63,308 వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారు. సర్టిఫికెట్ పరిశీనకు 95,256 మంది హాజరయ్యారు. మాక్ సీట్ల కేటాయింపును ఈనెల 13న అభ్యర్థులకు కేటాయించనున్నట్టు సాంకేతిక విద్యా కమిషనర్ శ్రీదేవసేన ఈమేరకు తెలిపారు.