30 August, 2026 | 4:56 PM

ఒకే ర్యాంకు రెండు విద్యాసంస్థలకా?

11-06-2024 02:27 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో మొదటి ర్యాంకు తమదంటే తమదంటూ ఒకే ర్యాంక్ ను ప్రకటించి విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న శ్రీచైత న్య, నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎల్ మూర్తి, నాగరాజు సోమవా రం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. రెండు విద్యాసంస్థలకు ఒకే ర్యాంక్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. మొదటి ర్యాంకు సాధించిన రాఘవశర్మ తమ కళాశాలలోనే చదివాడని తప్పు డు ప్రచారం చేస్తున్నాయని, అధికారులు వెంటనే దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.