14-07-2025 12:47:07 AM
- పట్టుదల స్వయంకృషి ఎప్పుడు కోల్పోకూడదు
- దైవ అనుగ్రహం సన్మార్గంలో నడిపిస్తుంది
- మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 13 (విజయ క్రాంతి) : మనిషి జీవితంలో విద్యాభ్యాసం చరిత్ర సృష్టిస్తుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల విశ్రాంత అధ్యాపకుల ఆత్మీయ సమ్మేళనం ప్రభుత్వ బిఇడి కళాశాలలో నిర్వహించిన సమావేశానికి, ఆషాఢ మాసం బోనాలు సందర్భంగా పట్టణం లోని కురిహిని శెట్టి కాలనీ లో జరిగిన ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాల్లో ఎమ్మెల్యే తోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థ ను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు, అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలను గత ప్రభుత్వం విస్మరించి కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని ఆయన మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి విద్యా సంవత్సరం 9 వేల అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన చేశామని గుర్తు చేశారు.
దైవ అనుగ్రహం ప్రతి ఒక్కరిని సన్మార్గంలో నడిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ పి వెంకటేష్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ,, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, కామర్తి ఈశ్వరయ్య, మద్దూరి రాఘవేందర్, లీడర్ రఘు, డీలర్ రఘు, దోమ సాయి కుమార్, భీమరాజు, అశోక్ చిన్న స్వామి, ఎస్ జగపతి రావు, ఎస్ విజయ్ కుమార్, ప్రతాప్ రెడ్డి తదితరులు ఉన్నారు.