calender_icon.png 17 July, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

14-07-2025 12:48:34 AM

రాజాపూర్ జులై 13: మండల కేంద్రంలోని రాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో  చదివిన 1990-1991 పదవ తరగతి పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల లో చదివిన పూర్వ విద్యార్థినీ,విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గు రువులను ఘనంగా సన్మానించారు. ముందుగా వారు చదువుకున్న పాఠశాల ఆవరణలో సరస్వతి దేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఓ పక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సమ్మేళనంలో పాల్గొన్నారు.

పాఠశాల విద్యాభ్యాసం సమయంలో తమ మధురానుభూతులను నెమ రువేసుకున్నారు.ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుని చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తమతోపాటు చదివి స్వర్గస్తులైన స్నేహితులను, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుని 2 నిమిషాలు మౌనం పాటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వారిని ఎంతగానో అలరింపజేశాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాల లింగయ్య,శేషగిరిరావు, పెంటయ్య, శ్రీనివాసరావు, పూర్వ వి ద్యార్థులు బచ్చిరెడ్డి, రామకృష్ణ, అచ్చయ్య,కృష్ణయ్య,శ్రీదర్,వెంకటేష్,ప్రవీణ్,అశోక్,శ్రీశైలం అబ్దుల్లా,ఇబ్రహీం,అరుణ,సావిత్రి,తదితరులు పాల్గొన్నారు.