calender_icon.png 14 July, 2025 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధుడి మార్గమే సమాజానికి దిక్సూచి

14-07-2025 12:46:57 AM

బీఎన్ ఐ రాష్ట్ర అధ్యక్షుడు పరంధాములు

హనుమకొండ, జూలై 13 (విజయ క్రాంతి): బుద్ధుడి మార్గమే సమాజానికి దిక్సూచి అని బుద్ధిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు పరందాములు, లలితా ఫౌండేషన్ చైర్మన్ కేకే రాజు, డీబీఎఫ్ జాతీయ ప్రతినిధి శంకర్ అన్నారు. ఆదివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో భారతీయ బౌద్ధ మహాసభ ఉమ్మడి వరంగల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యకుడు నక్క సుదర్శన్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరి బొమ్మల్ల అంబేడ్కర్ ఆధ్వర్యంలో అభ్యుదయ ఆరట్స్ అకాడమీ సాంస్కృతిక చైతన్య యాత్ర హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుద డితో నా ప్రయాణం - డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నృత్య రూపకం (నాటకం) ప్రదర్శించారు.

ఈ నాటకంలోని నటులు పాత్రలకు జీవం పోసి ఆధ్యంతం అలంరింప చేసి రక్తికట్టించారు. బుద్ధుడి బోధనలు, ప్రవచనాలను నాటకంలో ఉటంకిస్తూ ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్, బీఎస్.ఐ. అంబేద్కర్ సంఘం రాష్ట్ర, జిల్లా నేతలు జవ్వాజి కిషన్, అంకేశ్వరపు కుమార్ కృష్ణ స్వామి, సాంబయ్య, మిదైపాక ఎల్లయ్య, చిట్యాల బాబు, మన్నె బాబురావు, యాదాల రవీందర్, కొమురయ్య, గద్ద నర్సయ్య, చుంచు రాజేందర్, వెలిగొండ రాములు తదితరులు పాల్గొన్నారు.