13-01-2026 08:02:17 PM
మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న గోదాములో సిసి రోడ్ మరమ్మతులు లకు తీర్మానం
ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ సాధారణ సర్వసభ్య సమావేశంలో చైర్పర్సన్ రజిత వెంకట్రాంరెడ్డి
ఎల్లారెడ్డి(విజయక్రాంతి): ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న మూడు మండలాల్లోని మార్కెట్ యార్డుల్లో గోదాముల మరమ్మత్తులు కొరకు మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ యాడ్లో సిసి రోడ్ నిర్మాణం కొరకు ఎల్లారెడ్డి పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో రైతు బజార్ నిర్మాణం కొరకు తలు తీర్మానాలు చేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామిరెడ్డి తెలిపారు.
మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీలు పాలకవర్గ సభ్యులతో సర్వసభ్య సాధారణ సమావేశం నిర్వహించారు. సాధారణ సర్వసభ్య సమావేశంలో కార్యవర్గ సభ్యులతో కమిటీ చైర్మన్ ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో ఉన్న మూడు మండలాల్లో ఉన్న గోదాం లో మరమ్మత్తులు పలు పనులు చేపట్టాలని కార్యవర్గ సభ్యులతో తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు శంకరయ్య గంగారెడ్డి నాగేశ్వర్ శ్రీనివాస్ హరి నారాయణ పూల్ సింగ్, లక్ష్మణ్ లక్ష్మీనారాయణ హోల్ సింగ్ మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, సిబ్బంది శశిధర్ తదితరులు పాల్గొన్నారు.