calender_icon.png 14 January, 2026 | 1:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యమ పాశంలా మారినా చైనా మాంజా... ఉప్పల్లో ఏఎస్ఐ కి తీవ్ర గాయాలు

13-01-2026 09:31:59 PM

ఉప్పల్,(విజయక్రాంతి): సంక్రాంతి పండుగ సమీపిస్తుండటంతో గాలిపటాల సందడి పెరుగుతోంది. కానీ ఈ సంబరాల మధ్య చైనా మాంజాలు అనేక కుటుంబాలకు విషాదాన్ని మిగులుస్తున్నాయి. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్లకుంట పిఎస్ లో విధిలు నిర్వహిస్తున్న ఏఎస్ఐ నాగరాజు ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్లోని తన  ఇంటి నుంచి  బైక్ పై బయలుదేరి సమయంలో ఉప్పల్ సౌత్ స్వరూప్ నగర్ వద్ద చైనా మాంజా తన మెడకుతగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

ప్రమాదంలో బైక్ అదుపు తప్పడంతో మెడ, ముఖం,చేతులకుగాయాలయ్యి. చికిత్స నిమిత్తం ఎల్బీనగర్ ప్రవేట్ ఆసుపత్రికిఆయన ను తరలించారు  ఇదే తరహాలో ఉప్పల్ పరిధి వెంకట నగర్ డివిజన్లోని వాసవి నగర్ చెందిన వీరేశ్ కూడా ఇటీవల కాలంలో చైనా మాంజ  కారణంగా తీవ్ర గాయాల పాలయ్యాడు  వరుస ఘటనలు జరుగుతున్నప్పటికీ  మాంజా అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పడటం లేదు. ఓ పక్క పోలీసులు మాంజా అమ్మకాలపై ఉక్కు పాదం మోపుతున్న కొంతమంది గుట్టుచప్పుడుగా మాంజ అమ్మకాలు నిర్వహిస్తున్నారు.

ప్రతి ఏడది సంక్రాంతి సీజన్లో తెలుగు రాష్ట్రాల్లో చైనా మాంజల వల్ల పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా బైక్ పై వెళ్లే వారిని ఈ ఉరితాడులా మారుతున్నాయి. మనుషులే కాదు వేల సంఖ్యలో పక్షులు కూడా చైనా మాంజల వల్ల ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చైనా మాంజ అమ్మకాలపై  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.