calender_icon.png 13 January, 2026 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తంగళ్ళపల్లిలో రహదారి భద్రత మాసోత్సవాల అవగాహన కార్యక్రమం

13-01-2026 08:59:35 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని తాడూరు చౌరస్తాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా డ్రైవర్లు, ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ప్రమాదాలకు ప్రధాన కారణం నిర్లక్ష్యమని డిటిఓ లక్ష్మణ్ పేర్కొంటూ, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అన్నారు. రోడ్డు నియమాలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నిబంధనను జిల్లా కలెక్టర్ అమలు చేస్తున్నారని, అందరూ సహకరించాలని కోరారు.