calender_icon.png 13 January, 2026 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ రైతులకు యంత్ర లక్ష్మి పథకం ఎంతో మేలు చేస్తుంది

13-01-2026 08:04:01 PM

మంథని రైతులకు వ్యవసాయ యంత్రాల పంపిణీలో మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): తెలంగాణ రైతులకు యంత్ర లక్ష్మి పథకం ఎంతో మేలు చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.   రైతులకు వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా  రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆద్వర్యంలో 10 ఏండ్ల తరువాత ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆలోచనతో సంక్రాంతి పండగ సంద్బంగా యంత్ర లక్ష్మి పథకంలో  మంథని సబ్ డివిజన్ లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్ పూర్  రైతులకు రూ.58.38 లక్షల వ్యయంతో 703 యూనిట్లను  సోమవారం రాత్రి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  దుద్దిళ్ల శ్రీధర్ బాబు శివకిరణ్ గార్డెన్స్ లో లబ్ది దారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి డిఎఓ బత్తిని శరీనివాస్, సహయ సంచాలకులు ఎడిఏ శ్రీమతి అంజనీ మిశ్రా, మంథని, కమాన్ పూర్ మంథని ఎఏంసీ చైర్మన్లు కుడుదుల వెంకన్న, వైనాల రాజు, టిజిఇఆర్సి సలహ కమీటి సభ్యులు శశిభూషణ్ కాచే, కిసాన్ కాంగ్రేస్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.