లారీ ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి..
కూకట్ పల్లి (విజయక్రాంతి): విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ సెక్యూరిటీ గార్డు ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కెపిహెచ్బి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన సలేగా రమేష్ (43) గాజులరామారంలో ఉంటూ ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే విధులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కెపిహెచ్బి కాలనీ ఆల్మోండ్ స్వీట్ హౌస్ వద్ద యూటర్న్ తీసుకుంటుండగా వెనకనుంచి అతివేగంగా అజాగ్రత్తతో వచ్చిన లారీ అతని ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో కిందపడిపోగ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కేపీహెచ్బీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడి వివరాలు సేకరించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.




