6 June, 2026 | 10:33 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి కృషి

03-11-2025 01:01 AM

ఉచిత చేప పిల్లల పంపిణీ

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

నకిరేకల్ నవంబర్ 2 : మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం  అన్నారు, ఆదివారం  నకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం పెద్ద చెరువులో ప్రభుత్వం  అందిస్తున్న ఉచిత చేప పిల్లల ను చెరువులోవదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియెజకవర్గ వ్యాప్తంగా 223 చెరువుల్లో 1 కోటి 05 లక్షలు ఉచిత చేప పిల్లలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఉచిత చేప పిల్లల పంపిణి కార్యక్రమాన్ని మత్సశాఖ సోసైటి సభ్యులు వినియోగించుకోవాలి ఆయన  సూచించారు .

మత్స్యకారులకు వలలు, ఇతర పరికరాలు సబ్సిడీ ద్వారా ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి,  నకిరేకల్ మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత  శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు,  కౌన్సిలర్లు ,నాయకులు  పన్నాల రాఘవరెడ్డి , గాజుల సుకన్య యాసారపు వెంకన్న, మట్టిపల్లి వీరు, కొండ వెంకన్న గౌడ్, లక్ష్మీనారాయణ, మత్సశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.