calender_icon.png 3 November, 2025 | 12:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

రాజ్యాంగ సవరణతోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత

03-11-2025 01:04:24 AM

మిర్యాలగూడ, నవంబర్ 2. (విజయ క్రాంతి) : జనాభా ప్రాతిపదికన విద్యా, ఉద్యోగ,ఉపాధి, రాజకీయంగా బీసీలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగ సవరణతోనే  బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు పోగుల సైదులు గౌడ్ అన్నారు. ఆదివారం ఆయన స్థానికంగా విలేకరులతో మాట్లాడుతూ బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం కల్పించాలంటే లోక్ సభ, రాజ్యసభలతో పాటు  వాటి అమలుకు కృషి చేయడంతో పాటు రాష్ట్రపతి ఆమోదం పొందేలా చూడాలన్నారు.

పార్లమెంటు చేసిన చట్టాలను న్యాయస్థానాలు తిరస్కరించలేవని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చలేదన్నారు. బీసీ రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మద్దతు తెలపాలన్నారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే విషయంలో పార్ల మెంటులో ప్రస్తావించేలా తెలంగాణ ప్రభుత్వం అఖిలపక్షాన్ని కేంద్రానికి తీసుకువెళ్లాల న్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి  శివరామకృష్ణ, ఎం పి ఎస్ జిల్లా అధ్యక్షులు ఏడుకొండలు, కోల వెంకన్న, వేముల లాలు, శ్రీనివాస్, సతీష్ కుమార్ తదితరులున్నారు.