1 July, 2026 | 2:12 AM

పట్టణ అభివృద్ధికి కృషి

01-07-2026 01:40 AM

నిర్మల్, జూన్ 30 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి అన్నారు. మంగళవారం నిర్మల్ మున్సి పల్ సర్వసభ సమావేశం నిర్వహించారు.

నిర్మల్ పట్టణంలో చేపట్టవలసిన అభివృద్ధిపై చర్చించి ఎజెండాను రూపొందించినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో పారిశుధ్య నిర్వహణ మురికి కాలువల నిర్మాణం సీసీ రోడ్లు చేపట్టి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిబాబు సిబ్బంది పాల్గొన్నారు.