‘సర్’ను నూరు శాతం పూర్తికి కృషి చేయాలి
దామరచర్ల, జూలై 23: సర్ కార్యక్రమాన్ని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించడంతో పాటు, దామరచర్ల మండలంలోని ప్రతి గ్రామంలో నూరు శాతం పూర్తి చేసేలా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కృషి చేయాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సూచించారు. దామరచర్లలో గురువారం సర్పంచ్ లు, బి ఎల్ ఏ లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియలో ఎలాంటి అర్హులైన ఓటరు కూడా మిస్ కాకుండా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి బీఎల్‌ఏ తమకు కేటాయించిన బూత్ పరిధిలో పూర్తి స్థాయిలో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా సర్పంచ్లు, పార్టీ నాయకులు, బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో దామరచర్ల సర్పంచ్ రేణుక సిరి, సిద్దు నాయక్ ,కిరణ్ ,ఎల్ వి సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచ్లు, బీఎల్‌ఏలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.






