ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
వెంకటాపురం (నూగూరు)/ జూలై 12 (విజయక్రాంతి): మండలంలోని ప్రజల సమస్యల పరిష్కారానికి గ్రామ సర్పంచ్ లు, కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలోని స్థానిక మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అత్యంత ఉత్తేజ వాతావరణంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు, పిఎసిఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శ్రమ కృషి ఫలితంగానే నేడు మండలంలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుందన్నారు. మండలంలో గ్రామాలలో ఏమైనా సమస్యలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరు సమన్వయంగా కృషి చేయాలని కోరారు.
నేడు రాష్ట్రంలో జరుగుతున్న సర్ ప్రక్రియలో పాల్గొని ఓటర్ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ధనపనేని వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు మన్యం సునీల్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడం సాంబశివరావు, యువ నాయకులు బాలసాని వేణుగోపాల్, యువజన మండల అధ్యక్షులు చిట్టెం సాయి, గ్రామపంచాయతీ సర్పంచ్ లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






